రెంటికి చెడిన రేవడి వైయస్ వివేకానంద రెడ్డి

ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిస్తే తప్ప మంత్రి పదవి చేపట్టబోనని చేసిన శపథం ఆయనకే శాపంగా మారింది. ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం తనకు ఇష్టం లేదని ఆయన చెప్పుకున్నారు. దీంతో కాంగ్రెసు పార్టీలో ఆయన ఏమీ కాకుండా పోయారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా ఆయనను పెద్దగా పట్టించుకోవడం లేదు. వైయస్ జగన్ ఒకటి, రెండు సార్లు పలకరించినప్పటికీ పార్టీలోకి తీసుకుని వైయస్ వివేకానంద రెడ్డికి ప్రధాన బాధ్యతలు అప్పగించడానికి ఇష్టంగా లేరని అంటున్నారు. తనను కాదని, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ మాట విని తనవైపు రానందుకు వైయస్ జగన్ ఇప్పటికీ వివేకానంద రెడ్డిపై కోపంగానే ఉన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications