హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాలి అరెస్టుతో వైయస్ జగన్‌లో కంగారు: డిఎల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

DL Ravindra Reddy
హైదరాబాద్: వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ అరెస్టుకు భయపడే కాంగ్రెసుకు మళ్లీ దగ్గరవ్వాలనుకుంటున్నారని ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి బుధవారం విమర్శించారు. కర్నాటక మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత గాలి జనార్ధన్ రెడ్డి అరెస్టుతో జగన్‌లో కంగారు మొదలైందన్నారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే జగన్ మళ్లీ కాంగ్రెసులోకి వస్తాడని తాను భావించడం లేదన్నారు. కాంగ్రెసు పార్టీ కూడా జగన్ లాంటి అవినీతిపరుడిని మళ్లీ ఆహ్వానిస్తుందని తాను అనుకోవడం లేదన్నారు. జగన్‌ను కాంగ్రెసు ఎప్పటికీ క్షమించదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మహానేత అని సొంత మీడియాలో ప్రచారం చేసుకుంటే సరిపోతుందా అని ప్రశ్నించారు.

తమ కుటుంబం వల్లే రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ బతికిందని ఎలా అంటున్నారన్నారు. కాంగ్రెసు పార్టీ వల్లే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాగలిగాడన్నారు. జగన్ అవసరం కాంగ్రెసు పార్టీకి లేదని జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి వేరుగా అన్నారు. జగన్ కాంగ్రెసు పార్టీలోకి తిరిగి వస్తానంటే రావచ్చునని అయితే సిబిఐ దర్యాఫ్తుకు, అరెస్టులకు భయపడి రాకూడదని కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ అన్నారు. పార్టీ మీద విశ్వాసం పెడితే రావచ్చునని సూచించారు.

English summary
Minister DL Ravindra Reddy said today that YSRC Party president YS Jaganmohan Reddy is in fear with Gali Janardhan Reddy arrest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X