పదవులపై టిడిపి, కాంగ్రెసుకు హరీష్ ప్రతి సవాల్

ప్రస్తుతం తెలంగాణలోని ప్రతి వ్యక్తి ప్రత్యేక రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నాడన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఎలాంటి ఢోకా లేదన్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే తెలంగాణ వచ్చాకే ఉద్యమం ఆగేలా కనిపిస్తోందన్నారు. త్వరలో జరిగే తెలంగాణ గర్జనను విద్యార్థులు విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ ప్రజా ఫ్రంట్ నేత గద్దర్ టిఆర్ఎస్‌పై విమర్శలు మానుకోవాలని లేదంటే ప్రజాకోర్టులో నిలబెడతామని హెచ్చరించారు. టిఆర్ఎస్‌ను ఉద్దేశించి మాట్లాడే హక్కు గద్దర్‌కు లేదన్నారు. కెసిఆర్, కోదండరామ్‌లపై గద్దర్ ఎందుకు విమర్శలు చేస్తున్నారో చెప్పాలన్నారు. తెలంగాణ మంత్రులకు చిత్తశుద్ధి ఉంటే సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications