తెలుగుదేశానికి నాగం గుడ్‌బై, నడి రోడ్డు పైనే ప్రెస్ మీట్

ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్సులో ప్రెస్ మీట్ పెట్టవద్దని పోలీసులు చెప్పడంతో వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం నడిరోడ్డుపైనే ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. కర్నాటక మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ నేత గాలి జనార్ధన్ రెడ్డి మైనింగ్ వ్యవహారంలో కేవలం తాము మాత్రమే న్యాయంగా వ్యవహరించామని నాగం తన ప్రెస్ మీట్‌లో అన్నారు. తెలంగాణ వాదం ఎత్తుకున్నందుకే తనను పార్టీ నుండి బహిష్కరించారని ఆరోపించారు. ఈ నెల 9వ తేదిన ఐక్య ఉద్యమ వేదిక ప్రకటిస్తామని చెప్పారు. తెలంగాణపై టిడిపికి స్పష్టమైన వైఖరి లేదన్నారు.












Click it and Unblock the Notifications