వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ పేలుళ్లు తెహ్రిక్ సంస్థ పనే, జిహాద్‌ కోసమని ప్రకటన

By Srinivas
|
Google Oneindia TeluguNews

Delhi High Court
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీ హైకోర్టు వద్ద పేలుళ్లకు పాల్పడింది ఉగ్రవాద సంస్థ కావచ్చునని కేంద్ర హోంశాఖ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. జీహాద్‌లో భాగంగానే ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. తెల్ల లాల్చి, పైజామా వేసుకున్న బాంబు పేలుడుకు ముందు హైకోర్టు ప్రాంగణంలో అనుమానాస్పదంగా కనిపించినట్లు పలువురు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బుధవారం ఉదయం తెల్ల లాల్చి, పైజామా వేసుకున్న ఓ వ్యక్తి వచ్చి పార్కింగ్ దగ్గర ఉన్న కారులో సూట్ కేసు బాంబు పెట్టినట్లుగా స్థానికులు అనుమానిస్తున్నారు. సదరు వ్యక్తి కారులో బాంబు పెట్టాక బయటకు పరుగెత్తాడాని బాంబు పేలగానే అతను కోర్టు ప్రధాన ద్వారాన్ని మూసివేసి బయటకు పరుగెత్తాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అతనే బాంబు పెట్టి ఉంటాడని పోలీసులు కూడా అనుమానిస్తున్నారు.

కాగా బాంబు పేలుడుకు పొటాషియం నైట్రేట్ వాడినట్లుగా తెలుస్తోంది. సూట్ కేసు బాంబు పెట్టినట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. వర్షం కారణంగా ఆధారాలు సేకరించడానికి ఆటంకం ఏర్పడుతోంది. హైకోర్టు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎన్ఐఏ, ఎన్ఎస్‌జి దళాలను భారీగా మోహరించారు. ఈ పేలుళ్లు తమదే అని తెహ్రిక్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. తెహ్రిక్‌కు లష్కరే తోయిబా మద్దతు ఉన్నట్లుగా తెలుస్తోంది. బాంబు పేలుళ్ల దృష్ట్యా రాజ్యసభ వాయిదా పడింది. బాంబు పేలుళ్లను లోకసభ ఖండించింది.

English summary
Tehric announced they are the caused to High Court bomb blast at Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X