అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మీకే నష్టం: మీడియాకు సిఎం కిరణ్ చురకలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
అనంతపురం: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనంతపురం జిల్లాలో గురువారం మీడియాకు చురకలు వేశారు. అనంతపురంలో రాజీవ్ యువ కిరణాల ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. కెమెరా, టీవి, మీడియాను నమ్మి ఎవరూ మోసపోవద్దని సభకు హాజరైన వారికి సూచించారు. మీడియా న్యూస్ ఇవ్వకుండా వ్యూస్ మాత్రమే ఇస్తోందన్నారు. అయితే వ్యూస్ ఇవ్వడంలో వారిని తాను తప్పు పట్టడం లేదని కానీ తప్పులను మాత్రమే చూపిస్తూ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను విస్మరిస్తోందన్నారు. మీడియా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలలోకి తీసుకు వెళ్లాలని సూచించారు. ఆధునిక టెక్నాలజీ యుగంలో ప్రజలు క్షణాల్లో వాస్తవాలు తెలుసుకుంటున్నారని మీడియా అవాస్తవాలు చెబితే వారి స్టాండర్డే తగ్గుతుందన్నారు. అది వారు గుర్తు పెట్టుకోవాలని సూచించారు.

సరైన ఆలోచనతో సరైన మార్గంలో పయనిస్తే యువత అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంట్స్ ఇస్తోందన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు. రైతుల కోసం కూడా ప్రభుత్వం పలు పథకాలు ప్రవేశ పెడుతోందన్నారు. రైతులు పంట నష్ట పోయిన కారణంగా రైతులకు వడ్డీ రుణాలు మాఫీ చేస్తున్నట్లు చెప్పారు. మూడేళ్లలో పదిహేను లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. వచ్చే జనవరి లోపే ఒక లక్ష మందికి ఒకేరోజు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు.

యువత ఒత్తిళ్లతో కాకుండా ఇష్టంతో ఫీల్డును ఎంచుకోవాలని సూచించారు. రాజీవ్ యువ కిరణాల పథకాన్ని ఎవరూ ఆపలేరన్నారు. డబ్బులు, ఆస్తితో మన లక్ష్యాలను చేరుకోలేమన్నారు. అందుకు కృషి ఉండాలన్నారు. కష్టపడి పని చేయాలన్నారు. కాగా ఈ కార్యక్రమానికి వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి అధ్యక్షత వహించారు. జిల్లాకు చెందిన సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి గైర్హాజరయ్యారు.

English summary
CM Kiran Kumar Reddy commented media today at Anantapur district in Rajeev Yuva Kiranalu inauguration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X