చంద్రబాబు తెలంగాణపై లేఖ ఇస్తే చాలు: కెకె

తెలంగాణ కోసం రాజీనామాలను చేసిన తెలంగాణ ప్రజాప్రతినిధులను లక్ష్యం చేసుకుని దాడులు చేయడం సరి కాదని, ఈ విషయాన్ని తాను తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్‌కు, విద్యార్థులకు చెప్పానని ఆయన అన్నారు. రాజీనామాలు చేయనివారిపై నైతికమైన ఒత్తిడి తేవాలని ఆయన సూచించారు. సకల జనుల సమ్మెలో కాంగ్రెసు శ్రేణులు పాల్గొంటాయని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యోగులను రెచ్చగొట్టవద్దని ఆయన ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ ఉద్యమం శాంతియుతంగా సాగాలని ఆయన సూచించారు. తమ స్టీరింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను కొంత మంది మంత్రులు పాటించకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు.












Click it and Unblock the Notifications