జగన్ ఆస్తులపై దర్యాప్తు, సుప్రీంలో మరిన్ని పిటిషన్లు

YS Jagan
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తులపై సిబిఐ దర్యాప్తును ఆపించాలని విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మరిన్ని పిటిషన్లు వేసే ఎత్తుగడలో ఉన్నారు. జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, సండూర్ పవర్ కంపెనీల పేరిట మూడు పిటిషన్లను సుప్రీంకోర్టులో దాఖలు చేయడం అందులో భాగమేనని అంటున్నారు. ప్రతివాదులు ఎర్రన్నాయుడు, శంకర్‌రావులపై జగతి పబ్లికేషన్స్ దాఖలు చేసిన ప్రత్యేక లీవ్ పిటీషన్లు న్యాయమూర్తులు జస్టిస్ దల్వీర్ భండారీ, జస్టిస్ దీపక్‌వర్మలతో కూడిన ధర్మాసనం ముందుకు శుక్రవారం విచారణకు వచ్చాయి.

జగన్మోహనరెడ్డి తమ కంపెనీల్లో ఒక ప్రమోటర్ మాత్రమేనని, అంతకుమించి ఆయనకు తమ కంపెనీలకు సంబంధమేం లేదని అన్నారు. జగన్‌పై రాజకీయంగా జరుగుతున్న విచారణకు, తమ సంస్థలకు సంబంధం లేదన్నారు. కాబట్టి, తమ సంస్థలపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. జగతి పబ్లికేషన్స్ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి శుక్రవారం ధర్మాసనం ఎదుట తన వాదనలు వినిపిస్తూ - ఎమ్మార్ సంస్థ కూడా సీబీఐ విచారణను నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని, కాబట్టి ఆ పిటిషన్‌కు జగతి పిటిషన్‌ను జోడించాలని కోరారు. రోహత్గి వాదనను ఎర్రన్నాయుడు తరఫు న్యాయవాది శ్రీనివాస్ కౌంటర్ చేస్తూ - ఎమ్మార్‌ది, జగన్‌ది వేర్వేరు కేసులని, ఒకదాంతో మరోదానికి సంబంధం లేదని వివరించారు. ఈ రెండు కేసులనూ జత చేయడం సరికాదన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ఎమ్మార్, జగతి పిటిషన్లను జత చేయబోమని, ఒకేరోజు విచారణ జరుపుతామని తెలిపింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

కొత్తగా వేసిన మూడు పిటిషన్లలో ఒకటి శుక్రవారం విచారణకు రాగా, సండూర్ పవర్ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. ఇందిరా టెలివిజన్ పిటిషన్‌పై విచారణ ఇంకా జరగాల్సి ఉంది. అయితే సీబీఐ విచారణకు హైకోర్టు వద్ద అన్ని ఆధారాలూ ఉన్నాయని గతంలోనే సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో, జగన్ ఎన్ని పిటిషన్లు వేయించినా అవి తిరస్కరణకే గురవుతాయని న్యాయనిపుణులు చెబుతున్నారు. అయినా సరే మిగతా కంపెనీల చేత కూడా పిటిషన్లు వేయించాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+