నాకు ఆ శక్తి ఉంది: జగన్ ఫిర్యాదుపై రోశయ్య

జగన్‌లాంటి యువకులు మాట్లాడిన మాటలమీద తాను వ్యాఖ్యానించనని స్పష్టం చేశారు. మీరు సీఎంగా ఉన్నప్పుడు ఓబుళాపురం గనుల అక్రమాలపై వేసిన సీబీఐ దర్యాప్తు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది కదా అని విలేకర్లు గుర్తుచేయగా - ఆయన ఆచితూచి స్పందించారు. ''నేను ఆగస్టు 31 సాయంత్రం 4 గంటల వరకు రాజకీయవాదిని. 4.22 గంటలకు తమిళనాడు గవర్నర్‌ని. అందువల్ల ఇప్పుడు రాజకీయాలు మాట్లాడేందుకు సిద్ధంగా లేను. అది నా విధి కూడా కాదు'' అని అన్నారు.
తమిళనాడు గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి ఢిల్లీకొచ్చిన రోశయ్య రాష్ట్రపతి ప్రతిభాపాటిల్, ఉపరాష్ట్రపతి హమీద్‌అన్సారీ, ప్రధాని మన్మోహన్‌సింగ్, ఆర్థికమంత్రి ప్రణబ్‌ముఖర్జీ, హోంమంత్రి చిదంబరంలను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం తమిళనాడు భవన్‌కు వెళ్లారు.












Click it and Unblock the Notifications