కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణ నాయకులు షాక్

స్టీరింగ్ కమిటీ నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉండాలని, లేకుంటే సమిష్టి నిర్ణయాలకు విలువ ఉండదని సమావేశంలో అభిప్రాయపడ్డారు. సీమాంధ్ర నాయకులతో తమ పార్టీ అధిష్టానం చర్చల తర్వాత తమ ఆందోళనా కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని సమావేశానంతరం పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. తెలంగాణకు సాధనకు మిగిలి ఉన్న మార్గాలను కూడా ఎంచుకుంటామని ఆయన చెప్పారు. తమ డిమాండుతో త్వరలో ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ సాధన కోసం దేనికీ తాము వెనక్కి వెళ్లదలుచుకోలేదని ఆయన అన్నారు. పార్లమెంటు సభ్యుల రాజీనామాలను స్పీకర్ తిరస్కరించలేదు, అంగీకరించలేదని ఆయన చెప్పారు.
తమ నిర్ణయాలను ఒకరిద్దరు వ్యతిరేకిస్తే అది లెక్కలోకి రాదని ఆయన అన్నారు. విధులకు హాజరయ్యే మంత్రులను తమ పార్టీ తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు టార్గెట్ చేసుకుంటారని శాసనసభ్యుడు రాజయ్య చెప్పారు. మంత్రులు విధులకు హాజరు కావద్దని ఆయన చెప్పారు. మంత్రుల రాజీనామాలకు ఒత్తిడి తెస్తామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications