విలీనం ద్వారా అవినీతికి చిరంజీవి లైసెన్స్: యనమల

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి 15 లక్షల ఉద్యోగాలిస్తామంటూ చేసిన ప్రకటనలపై తెలుగుదేశం పార్టీవిమర్శలు గుప్పించింది. తెదేపా నేతలు రాజేంద్రప్రసాద్, అరికెల నర్సారెడ్డి, శోభారాణి శనివారం హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రిగా గుర్తింపు కోసం కిరణ్‌కుమార్‌రెడ్డి పడుతున్న తాపత్రయంలో భాగమే ఈ 15 లక్షల ఉద్యోగాల ప్రకటన అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి 15 లక్షల ఉద్యోగాల ప్రకటనను ఈ మిలీనియం జోక్‌గా నేతలు అభివర్ణించారు. అయాచితంగా ఆయనకు ముఖ్యమంత్రి పదవి వచ్చినట్లు రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు వస్తాయని ముఖ్యమంత్రి భావిస్తున్నారా అని వారు ప్రశ్నించారు. ఏయే రంగాల్లో ఏయే శాఖల్లో ఎన్నెన్ని ఉద్యోగాలు కల్పిస్తారో స్పష్టంగా తెలియజేస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications