ఎమ్మార్ మొదటి ముద్దాయి చంద్రబాబే: పిఎన్వీ ప్రసాద్

చంద్రబాబు దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత 2000లోనే నానక్‌రామ్ గుడాలో భూసేకరణకు జివో జారీ చేశారని, అప్పుడే భూసేకరణకు సంబంధించి ఎపిఐఐసిలో ఫైలు కూడా తయారైందని ఆయన చెప్పారు. రైతులకు చెందిన 85 ఎకరాల భూమి స్వాధీనానికి కూడా అప్పుడే చర్యలు తీసుకున్నారని, ఎమ్మార్‌కు 535 ఎకరాలు అప్పగిస్తున్నట్లు 2002లో జీవో జారీ చేశారని ఆయన వివరించారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును సిబిఐ ఎందుకు విచారించడం లేదని ఆయన ప్రశ్నించారు.
మంత్రి వర్గ ఉప సంఘం చైర్మన్‌గా మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఉన్నప్పుడే ఎమ్మార్‌కు రాయితీలు ఇచ్చారని, ఎమ్మార్ ప్రాపర్టీస్‌తో సంబంధం ఉన్న ఎంజిఎఫ్ సంస్థ సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాది అని ఆయన అన్నారు స్టైలిష్ హోమ్స్ చంద్రబాబు మానస పుత్రిక అని, ఆ పేరుతోనే కోనేరు ప్రసాద్, చంద్రబాబు కలిసి కోట్ల రూపాయలు కొల్లగొట్టారని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications