బాలయ్య వస్తే మంచిది, అయినా కొత్తకాదు: బాబు

రాష్ట్ర ప్రభుత్వం రైతులపై ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా 3 లక్షల ఎకరాల్లో రైతులు పంట విరామం ప్రకటించారన్నారు. కౌలు రైతులకు ఆర్భాటంగా కార్డులిచ్చినా రుణాలు అందటం లేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు వ్యవసాయం దండగ అనే ఆవేదనతో ఉన్నారన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానం వల్ల 82 శాతం రైతులు అప్పుల పాలయ్యారన్నారు. రైతులకు అండగా ఉంటామన్నారు. రైతులకు మద్దతుగా ఆందోళనలు, ధర్నాలు, సంతకాల సేకరణ చేపడతామన్నారు. కాగా చంద్రబాబు నాయుడు అంతకుముందు అపోలోలోకి వెళ్లి అజహరుద్దీన్ తనయుడు అయాజుద్దీన్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.












Click it and Unblock the Notifications