తెలంగాణ వచ్చేది లేదు, పోయేది లేదు: టిజి వెంకటేష్

ప్రత్యేక తెలంగాణ ఇస్తామని కేంద్రప్రభుత్వం, సొనియాగాంధీ ఏనాడు చెప్పలేదని, ఏ ఒక్కరికి మాట ఇవ్వలేదని కాంగ్రెసు ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో ఆదివారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని విభజించడం జరిగితే ఇదే ప్రాతిపదికన అన్ని రాష్ట్రాల్లో విభజన జరగాల్సి ఉంటుందన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ, సీమాంధ్ర ప్రజలు స్థిరపడ్డారని చెప్పారు. రెండు ప్రాంతాల ప్రజలతో ఏర్పడిన అవినాభావ సంబంధమని, దీనిని ముక్కలు చేసి తెంచేయడం కుదరదని స్పష్టం చేశారు. ఎవరైనా ఈ రాష్ట్రానికి వచ్చి స్ధిరపడాలన్నా, ఏదైనా పరిశ్రమ స్థాపించాలన్నా ముందుగా హైదరాబాద్‌నే ఎంచుకుంటున్నారని చెప్పారు. ఇందుకు కారణం ఆంధ్ర, తెలంగాణ వారు అన్నదమ్ముల్లా మెలుగుతూ హైదరాబాద్‌ను తలమానికంగా తీర్చిదిద్దడమేనని పేర్కొన్నారు. కొద్ది మంది మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసినంత మాత్రన రాష్ట్రం విడిపోదన్నారు. ప్రత్యేక వాదం వూపందుకున్నాక గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications