ఏమైనా బాధ్యత వారిదే: జెఏసి చైర్మన్ కోదండరామ్

Kodandaram
హైదరాబాద్: ప్రభుత్వాన్ని ఆర్థికంగా దెబ్బ తీసేందుకే తెలంగాణ ప్రజలు సకల జనుల సమ్మె చేస్తున్నారని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ బుధవారం అన్నారు. సకల జనుల సమ్మె విజయవంతంగా నడుస్తోందన్నారు. మంత్రులు ఉద్యమిస్తే ఇబ్బందులు ఉండేవి కావన్నారు. తెలంగాణ వచ్చే వరకు ఉద్యమం చేస్తామన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. తెలంగాణకు రాజకీయ పరిష్కారమే మార్గమమన్నారు. కేవలం ప్రజలు మాత్రమే నిరసనలు తెలపడం కాకుండా సమ్మెలో ప్రజా ప్రతినిధులు సైతం పాల్గొనాలన్నారు. గురువారం నుండి ఏం జరిగినా కాంగ్రెసుదే బాధ్యత అన్నారు. ఈ నెల 18వ తారీఖు నుండి రహదారుల దిగ్బంధం చేస్తామని ప్రభుత్వం దిగి రాక తప్పదన్నారు.

సకల జనుల సమ్మె వల్ల ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ కరీంనగర్‌లో అన్నారు. కరీంనగర్‌లోని సకల జనుల సమ్మెకు ఆయన మద్దతు పలికారు. తెలంగాణ మంత్రులు చిత్తశుద్ధితో పని చేస్తున్నారని చెప్పారు. సకల జనుల సమ్మె తీవ్రత ఢిల్లీకి తాకాలన్నారు. అవసరమైతే హైదరాబాదునూ ముట్టడిస్తామన్నారు. సకల జనుల సమ్మెలో కాంగ్రెసు పాల్గొంటుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+