తెలంగాణ రాదని కెసిఆర్‌కు తెలుసు: శైలజానాథ్

Sailajanath
తిరుపతి: తెలంగాణ రాదనే విషయం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు తెలుసునని సీమాంధ్రకు చెందిన రాష్ట్ర మంత్రి శైలజానాథ్ వ్యాఖ్యానించారు. సమైక్యాంధ్ర విద్యార్థి గర్జన సదస్సులో ఆయన బుధవారం మాట్లాడారు. కెసిఆర్ పచ్చి అవకాశవాది అని, పార్టీలు మారుస్తారని ఆయన అన్నారు. కెసిఆర్ అబద్ధాలు మాట్లాడుతారని, తెలంగాణ ప్రజలు కెసిఆర్ మాటలకు మోసపోవద్దని ఆయన అన్నారు.

హైదరాబాద్ అంటే సంపాదించుకునే యంత్రం కాదని, హైదరాబాదు అంటే తాము మనుషులుగా చూస్తామని, మానవ సంబంధాలే తమకు ముఖ్యమని ఆయన అన్నారు. మనుషులుంటేనే మర్యాద, గౌరవమని ఆయన అన్నారు. రాష్ట్ర సమైక్యతను కాపాడడానికి ఎలాంటి యుద్ధానికైనా సిద్ధఫడతామని ఆయన అన్నారు. తెలుగు భాష, రక్తసంబంధాల కోసమే తాము సమైక్య రాష్టాన్ని కోరుకుంటున్నామని ఆయన అన్నారు. తాము కన్నెర్ర చేస్తే వేర్పాటువాదుల గుండెలు ఆగుతాయని ఆయన హెచ్చరించారు. కెసిఆర్ లాంటి వ్యక్తులు రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. సమైక్యాంధ్ర కోసం శాంతియుతంగా పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+