ఉద్యమాలతో తెలంగాణ రాదు: సిఎం కిరణ్ కుమార్ రెడ్డి

విభజన వాదంతో రాష్ట్ర అభివృద్ధి వెనకబడుతోందని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి గురువారం గుంటూరు జిల్లాలో అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే కొందరు ప్రత్యేకవాదం పేరుతో గొడవలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఉద్యమాల కారణంగా రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు వెనక్కి తరలి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి ఇది ఆటంకంగా మారుతోందన్నారు. సకల జనుల సమ్మెను విరమింప చేయడానికి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు. బొగ్గు ఉత్పత్తులు నిలిచిపోతే విద్యుత్‌పై ప్రభావం పడుతుందన్నారు. ఆ ప్రభావం తెలంగాణ ప్రాంతానికీ వర్తిస్తుందన్నారు.












Click it and Unblock the Notifications