సిఎం కిరణ్ కుమార్ రెడ్డికి చిరంజీవి భయం

వారిద్దరి బంధాన్ని విడదీసి, తనకు ఎదురు లేకుండా చేసుకోవడానికి కిరణ్ కుమార్ రెడ్డి పకడ్బందీ వ్యూహాన్నే రచించి అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. చిరంజీవిని ఢిల్లీకి పంపించాలనేది ఆయన వ్యూహమని చెబుతున్నారు. చిరంజీవిని ఎఐసిసిలోకి తీసుకోవాలని ఆయన అధిష్టానం పెద్దలకు సూచించారని చెబుతున్నారు. చిరంజీవిని ఢిల్లీకి పంపించడం వల్ల తనకు ఒకరి అడ్డు తొలగడమే కాకుండా, ఇద్దరు నాయకుల ఉమ్మడి కార్యక్రమాలకు గండి కొట్టి తన ఆధిపత్యాన్ని కాపాడుకోవాలని ఆయన అనుకుంటున్నారని చెబుతున్నారు.
ఇదే సమయంలో గత ప్రజారాజ్యం పార్టీ శానససభ్యులకు పదవులు ఇచ్చి తనకు అనుకూలంగా మార్చుకోవాలని కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి, ప్రజారాజ్యం పార్టీ శానససభ్యుల్లో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వాలని చిరంజీవి అడుగుతున్నారు. కానీ, ఇద్దరికి మాత్రమే అవకాశం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. మరి కొంత మందికి ఇతర పదవులు కట్టబెట్టవచ్చుననే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications