సోనియా గాంధీకి మంత్రి శంకరరావు లేఖ

P Shankar Rao
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్రంగా ధ్వజమెత్తిన మంత్రి పి. శంకరరావు శనివారం తమ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. వచ్చే దీపావళి పర్వదినం రోజు తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేయాలని ఆయన ఆ లేఖలో సోనియా గాంధీని కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ఆయన ఆ లేఖలో వివరించారు. రాజీనామాలు తెలంగాణకు పరిష్కారం కాదని ఆయన అన్నారు. రాజీనామా విషయంలో తనను ఎవరూ నియంత్రించలేరని ఆయన అన్నారు.

కొంత మంది అవినీతిపరులకు వ్యతిరేకంగా తాను పోరాటం చేస్తున్నందు వల్లనే తనను అక్రమ కేసుల్లో ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. గ్రీన్‌ఫీల్డ్స్ భూముల వ్యవహారంలో తాను అక్రమాలకు పాల్పడినట్లు అవాస్తవ కథనాలు ప్రసారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. తాను ఏనాడూ అవినీతికి పాల్పడలేదని ఆయన స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై ఏ విధమైన విచారణకైనా తాను సిద్ధమని ఆయన అన్నారు. వ్యాట్ పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించారు.

కాగా, తనకు భద్రతను తగ్గించారంటూ శంకరరావు చేసిన ఆరోపణలను డిజిపి దినేష్ రెడ్డి ఖండించారు. శంకరరావుకు భద్రత పెంచామని ఆయన చెప్పారు. గత జులై నుంచి శంకరరావుకు కల్పించిన భద్రతను బలోపేతం చేసినట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. గత జులై నుంచి శంకరరావుకు భద్రతను పెంచినట్లు ఆయన తెలిపారు. శంకరరావు భద్రత కోసం 32 మందిని వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+