తెలంగాణపై కిరణ్, బొత్స చొరవ తీసుకోవాలి: గండ్ర

సమ్మె తీవ్రత చూసి కేంద్రం వెంటనే తెలంగాణపై స్పందించాలన్నారు. అలాగే సమ్మె కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించాలని ఆయన ఆందోనకారులకు విజ్ఞప్తి చేశారు. నెలాఖరు వరకు కేంద్రం నిర్ణయం కోసం నిరీక్షిస్తామని ఆ తర్వాత మా నిర్ణయం మేం తీసుకుంటామన్నారు. కార్మికులు స్వచ్చంధంగా సమ్మెలో పాల్గొంటున్నారన్నారు. సమ్మె శాంతియుతంగా జరుగుతోందని దానిని ప్రభుత్వం ఆపే ప్రయత్నం చేయవద్దని కోరారు. కాగా హన్మకొండలోని గండ్ర వెంకట రమణా రెడ్డి ఇంటిని తెలంగాణవాదులు ముట్టడించారు. గండ్ర వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications