మోడీ మూడు రోజుల సద్భావనా దీక్ష విరమణ

Narendra Modi
అహ్మదాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తన మూడు రోజుల సద్భావనా దీక్షను సోమవారం సాయంత్రం ముగించారు. మతపెద్దలు ఆయన చేత దీక్షను విరమింపజేశారు. రాష్ట్రంలో శాంతిని, సామరస్యాన్ని, ఐక్యతను కోరుతూ ఆయన ఈ దీక్షను చేపట్టారు. ఈ మూడు రోజుల్లో ఎల్‌కె అద్వానీ, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, వెంకయ్యనాయుడి వంటి పలువురు బిజెపి నేతలు వచ్చి మోడీకి సంఘీభావం తెలిపారు.

కాగా, ముస్లిం పెద్దలు ఇచ్చిన టోపీని పెట్టుకోవడానికి మోడీ నిరాకరించడం వివాదంగా మారింది. తన దీక్ష మాత్రమే ముగిసిందని, మిషన్ కొనసాగుతుందని నరేంద్ర మోడీ దీక్ష విరమణ సందర్భంగా అన్నారు. సొంత ఇమేజ్‌ను పెంచుకోవడానికి తాను ఈ దీక్ష చేపట్టలేదని, దేశం కోసం తాను దీక్షను చేపట్టానని ఆయన అన్నారు. తన దీక్షలో ఏ విధమైన రాజకీయాలు లేవని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాల కన్నా తనకు దేశం ముఖ్యమని ఆయన అన్నారు.

నరేంద్ర మోడీని సుష్మా స్వరాజ్ ప్రశంసలతో ముంచెత్తారు. బిజెపికి నరేంద్ర మోడీ ఉన్నారని, కాంగ్రెసులు ఎవరున్నారని ఆమె అన్నారు. బిజెపి ప్రధాని అభ్యర్థిగా వెంకయ్యనాయుడు మోడీని అభివర్ణించారు. బిజెపి ప్రధాని అభ్యర్థి మోడీయేనని, అందులో సందేహం లేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+