ఆంధ్రా-తెలంగాణకు మధ్య ఆందోళనకారుల గోడలు

Telangana
హైదరాబాద్: సకల జనుల సమ్మెలో భాగంగా నల్గొండ జిల్లాలో తెలంగాణవాదులు గుంటూరు-నల్గొండ జిల్లాకు మధ్యన రాకపోకలు నిలిపి వేయడానికి సోమవారం గోడ కట్టారు. పొందుకుల వద్ద గోడ కట్టడంతో హైదరాబాదు రావాల్సిన పలు వాహనాలు గోడకు అవతల వైపుకు నిలిచి పోయాయి. నాగార్జున సాగర్ బ్రిడ్జి పైనా తెలంగాణవాదులు గోడ కట్టారు. నిజామాబాద్ జిల్లా బోధన్ వద్ద తెలంగాణవాదులు మహారాష్ట్ర - ఆంధ్రా సరిహద్దులో రాకపోకలను అడ్డుకున్నారు. రాజేంద్ర నగర్ ఎజి కళాశాల వద్ద తెలంగాణ ప్రజా ఫ్రంట్ నేత, ప్రజా యుద్ద నౌక గద్దర్ రహదారి దిగ్బంధంలో పాల్గొన్నారు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జాం అయింది. ఉస్మానియా విశ్వవిద్యాలయ టిఆర్ఎస్వీ విద్యార్థులు సమ్మెకు మద్దతుగా చలో సచివాలయాన్ని నిర్వహించారు. విశ్వవిద్యాలయం నుండి విద్యార్థులు ర్యాలీగా బయలు దేరారు. ర్యాలీ ఉండటంతో అక్కడ భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

మహబూబ్ నగర్ జిల్లాలోని అలంపూర్ వద్ద తెలంగాణవాదులు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ శవయాత్ర నిర్వహించి దిష్టిబొమ్మను దగ్ధం చేసే ప్రయత్నాలు చేశారు. దీనిని పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి డికె అరుణ దిష్టిబొమ్మను సైతం తగులపెట్టారు. మెదక్ జిల్లా జహీరాబాద్ సమ్మెలో పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి, తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు పాల్గొన్నారు. రహదారుల నిర్బంధం కారణంగా ముంబై నుండి హైదరాబాదు రావాల్సిన భారీ వాహనాలు అక్కడే నిలిచి పోయాయి. నల్గొండ జిల్లా చిట్యాలలో టిడిపి, టిఆర్ఎస్ మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.

సమ్మెకు మద్దతు తెలపడానికి వచ్చిన టిడిపి నేతలను టిఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. టిడిపి జెండాలను ధ్వంసం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఇరు వర్గాలను అక్కడి నుండి పంపించారు. మరోచోట మద్దతు పలకడానికి వచ్చిన వైయస్సార్సీ పార్టీ నేతలను తెలంగాణవాదులు తరిమి కొట్టారు. పలుచోట్ల రహదారుల పైకి వచ్చిన బస్సులను ధ్వంసం చేశారు. తెలంగాణ జెఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం నల్గొండ జిల్లాలోని పోచంపల్లి మండలం కొత్తగూడ గ్రామంలో జరిగిన దిగ్బంధంలో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+