కెనడాలో మహీంద్ర సత్యం రిసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్..

కొనుగోలుకు మధ్యస్థాయి కంపెనీలు అనుకూలంగా ఉంటాయన్నారు. ఇందుకు సంబంధించిన స్పష్టమైన వివరాలను మాత్రం వెల్లడించలేదు. దక్షిణాఫ్రికా, కతర్, సౌదీ అరేబియాల్లో విపరీతమైన వృద్ధి అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. మహీంద్రా సత్యంకు ప్రస్తుతం చైనాలో 500 మంది ఉద్యోగులున్నారు. వీరిలో 90% స్థానికులే.
కెనడాలోని ఒంటారియోలో గల యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూ క్యాంపస్‌లో తొలి స్మార్ట్ గ్రిడ్ రిసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్(ఆర్‌ఐసీ)ని ఏర్పాటు చేసినట్లు మహీంద్రా సత్యం ప్రకటించింది. ఈ సెంటర్ విద్యార్థులు, అధ్యాపకులు, ఐటీ నిపుణులకు మలితరం స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ నవకల్పనల అభివృద్ధికి దోహదపడుతుందని కంపెనీ తెలిపింది. యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూతో కుదిరిన ఎంవోయూలో భాగంగానే ప్రస్తుత ఆర్‌ఐసీని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.












Click it and Unblock the Notifications