తెలంగాణపై 2న రాజీనామా, ఆమరణ దీక్ష: కోమటిరెడ్డి

తెలుగుదేశం పార్టీ అధినేత తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇస్తే వారం రోజుల్లో కేంద్రం తెలంగాణ ఇస్తుందని అలా రాలేదంటే తెలంగాణ ప్రజలు, తెలుగుదేశం పార్టీ ముందు తలవంచుకొని నిలబడతానన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు తెలంగాణ కోసమంటూ రోజుకో డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. బాబు సమ్మెపై స్పందించక పోవడం బాధాకరమన్నారు.తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కాంగ్రెసు నేతలను తిట్టడం బాధేసిందన్నారు. తెలంగాణ ఇచ్చేది తెచ్చేది కాంగ్రెసే అని గుర్తుంచుకోవాలన్నారు. కేంద్రం ఈ నెలలో ఖచ్చితంగా తెలంగాణ ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. లేదంటే తాను తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమర్ రెడ్డి తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఆయన అహంకార పూరిత వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు. సమైక్యాంధ్రగా ఉంచకుంటే యుద్ధం వస్తుందని మంత్రి శైలజానాథ్ అంటున్నారని ఒకవేళ కేంద్రం తెలంగాణ ఇవ్వకుంటే శైలజానాథ్ చెప్పినట్లుగా తాను యుద్ధంలోకి దిగుతానని స్పష్టం చేశారు.
ఈ మధ్య పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ తెలంగాణపై తగ్గినట్లుగా కనిపిస్తున్నారని ఆయన చొరవ చూపితే బావుంటుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రాంతంలో విద్యార్థుల ఆత్మహత్యలు సీమాంధ్ర పెట్టుబడిదారుల హత్యలే అన్నారు. కాంగ్రెసులో ఉన్న చిరంజీవి సామాజిక తెలంగాణకు కట్టుబడి ఉన్నానని ప్రకటించాలన్నారు. వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో తనకు ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తమకు రాజకీయ గురువే అని అయినా ప్రస్తుతం జగన్‌తో ఎలాంటి సంబంధాలు లేవన్నారు.












Click it and Unblock the Notifications