ఐఐటి కాన్పూర్ బిటెక్ విద్యార్థి ఆత్మహత్య

IIT Kanpur
కాన్పూర్: ఐఐటి కాన్పూర్ బిటెక్ ప్రథమ సంవత్సరం విద్యార్థి తన హాస్టల్ గదిలో గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. గత ఐదేళ్లలో ఇటువంటి సంఘటనల్లో ఇది ఐదోది. ఓ సూసైడ్ నోట్ రాసి పెట్టాడు. తన తరగతి విద్యార్థులను ముగ్గురిని సంబోధిస్తూ అతను ఆ నోట్ రాశాడు. తాను ఐఐటి చదువుతో విసిగిపోయినట్లు అతను ఆ నోట్‌లో రాశాడు. ఆత్మహత్య చేసుకున్న 19 ఏళ్ల విద్యార్థి మెహ్తబ్ అహ్మద్ ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజుకు చెందినవాడు

అహ్మద్ తన గదిలో ఉరేసుకుని చనిపోయి ఉండడాన్ని అతని మిత్రులు చూశారు. వారు తమ అధికారులకు సమాచారం అందించడంతో హాస్టల్ వార్డెన్ అక్కడికి చేరుకున్నారు. విద్యార్థి మరణించడాన్ని ఆతను గమనించాడు. అహ్మద్ మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థి. ఆ సంఘటనపై విచారణకు నలుగురు సభ్యులతో ఓ కమిటీని వేశారు. వారంలోగా నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లు ఐఐటి - కాన్పూర్ డైరెక్టర్ సంజయ్ ధాండే చెప్పారు. విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు ఐఐటి - కె రిజిస్ట్రార్ సంజీవి కసాల్కర్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+