జగన్ కంటే చంద్రబాబే నయం: ధర్మాన ప్రసాద్

కాంగ్రెసు ప్రజల పార్టీ అని, ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయడానికి పల్లకీ మోసే బోయీలమయ్యే అవసరం తమకు లేదన్నారు. కాంగ్రెసు పార్టీని వీడిన వారు ఎప్పటికైనా తిరిగి రావాల్సిందేనన్నారు. ప్రభుత్వం అమ్ములపొదిలో మరికొన్ని సంచలన పథకాలున్నాయని అవసరమైతే పేదలకు ఉచితంగా బియ్యం అందజేసే విషయాన్ని ఆలోచిస్తామన్నారు. కాంగ్రెసు ప్రజల కోసం ఎంతగా పాటుపడుతున్నప్పటికీ కొన్ని పత్రికలు సొంత అజెండాను అమలు చేస్తూ ప్రభుత్వంపైన, నాయకులపైన విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. తనకు పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణతో ఎలాంటి విభేదాలు లేవన్నారు.












Click it and Unblock the Notifications