సిఎం కిరణ్ అబద్దాలాడుతున్నారు: కాంగ్రెస్, టిఆర్ఎస్

ముఖ్యమంత్రి అబద్దాలాడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. కేంద్రానికి నివేదికలు పంపిన విషయంపై ఆయన మాటలు సరిగా లేవన్నారు. ఆయన మంత్రివర్గంలో పని చేస్తున్నందుకు తాను సిగ్గుతో తలదించుకుంటున్నానన్నారు. మంత్రిగా పని చేయడం దౌర్భాగ్యమన్నారు. తెలంగాణకు తెలంగాణ వాళ్లే వ్యతిరేకమన్న కిరణ్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ప్రభుత్వం జల విద్యుత్ పూర్తిగా తగ్గించిందని కెటిఆర్ అన్నారు. ఉద్యమాన్ని దెబ్బతీసేందుకే ఉత్పత్తిని తగ్గించారని ఆరోపించారు. విద్యుత్ రంగంపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయానికి ఏడుగంటలపాటు విద్యుత్ సరఫరా చేయాలన్నారు ప్రభుత్వం తీరు చూస్తుంటే తెలంగాణపై ద్వేషం కలిగేలా వ్యవహరిస్తోన్నట్టు కనిపిస్తోందన్నారు. రాష్ట్ర అవసరాల కోసం సిఎం కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిని గ్యాస్ అడగనే లేదన్నారు. చెప్పేవన్నీ అబద్దాలే అన్నారు. ముఖ్యమంత్రి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు రహదారిపై నుండి కదిలేది లేదన్నారు.












Click it and Unblock the Notifications