తెలంగాణపై తేల్చుకోవాల్సింది పార్టీలే: లగడపాటి

సకల జనుల సమ్మె వల్ల ప్రయాణాలు రద్దు చేసుకుని ఎవరి ప్రాంతాల్లో వారు ఉండిపోతున్నారని ఆయన చెప్పారు. సకల జనుల సమ్మె కాదని, సకల జనుల కష్టాల సమ్మె అని ఆయన అన్నారు. ప్రజలపై ఉద్యోగులు సమ్మె చేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యోగులు ప్రజలను కష్టపెడుతున్నారని ఆయన అన్నారు. ఇతర ప్రాంతాల్లో ప్రజలు సుఖపడుతుండగా, తెలంగాణలో ప్రజలు కష్టపడుతున్నారని ఆయన అన్నారు. ప్రజల పనులను పక్కన పెట్టి ఉద్యోగులు సమ్మె చేయడం దురదృష్టకరమని ఆయన అన్నారు. సమ్మె చేస్తున్న ఉద్యోగులపై ప్రభుత్వం సహనం, ఓపికలతో వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications