మంత్రిని, కాంగ్రెసు ఎంపిలను అరెస్టు చేసిన పోలీసులు

కాగా, విమలక్క నాయకత్వంలోని తెలంగాణవాదులు 30 మంది నానక్‌రాం గుడాలోని ఎమ్మార్ ప్రాపర్టీస్ కార్యాలయం భవనంపైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తున్నారు. తెలంగాణవాదులు ఎమ్మార్ ప్రాపర్టీస్ కార్యాలయంలోకి చొరబడి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అద్దాలు పగులగొట్టారు. ఆ తర్వాత మూడో అంతస్థుపైకి ఎక్కి బెదిరిస్తున్నారు. పోలీసులు లోపలికి రావడానికి ప్రయత్నిస్తే తాము కిందికి దూకుతామని వారు హెచ్చరిస్తున్నారు. దీంతో వారిని కిందికి రాబట్టేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలావుంటే, సచివాలయాన్ని ముట్టడించడానికి ప్రయత్నించిన గద్గర్‌ను, ఇతర తెలంగాణవాదులను పోలీసులు పబ్లిక్ గార్డన్ వద్ద అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications