ఆర్టీఏ ఆఫీసర్‌పై చేయి చేసుకున్న తెలంగాణవాదులు

అనంతరం కార్యాలయంలో కొద్దిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఐకాస నేతలు అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ రావు పైన చేయి చేసుకున్నారు. మరికొందరు తెలంగాణ నేతలు దాడి చేస్తుండగా అడ్డుకున్నారు. అనంతరం పరిస్థితి అదుపులోకి వచ్చింది. తెలంగాణ నేతలు అక్కడి నుండి నేరుగా హాకా భవన్ వెళ్లి అక్కడా తాఖీదులు ఇవ్వడాన్ని ఖండిస్తూ ఆందోళన చేపట్టారు. కాగా అంతకుముందు కెటిఆర్ మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు మధ్య కోల్డ్ వార్ నడుస్తోందన్నారు. బొత్స భుజాలపై తుపాకి పెట్టి ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యోగులను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగులను వేధించ వద్దని ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నట్లు చెప్పారు. ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications