బాన్సువాడపై మా లక్ష్యం నెరవేరలేదు: ఎర్రబెల్లి

తెలంగాణ ప్రజల ఆకాంక్ష కేంద్రానికి తెలియజేయడానికి ఏ పార్టీ అభ్యర్థిని నిలబెట్టవద్దనేది మా లక్ష్యం నెరవేరకుండా పోతోందన్నారు. ఇప్పటికైనా వారికి చిత్తశుద్ధి ఉంటే ఉప ఎన్నికలు బహిష్కరించాలని సవాల్ చేశారు. 600 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు బాధ్యత వహించాలన్నారు. దివంగత ఎన్టీఆర్ విగ్రహాలను టిఆర్ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. కెసిఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిందే ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ పైన అభిమానంతో తన కొడుక్కు పెట్టుకున్న పేరును కెసిఆర్ ఇప్పుడు మార్చుకుంటారా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications