జగన్‌పై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు

వాన్‌పిక్ ప్రైవేట్ లిమిటెడ్, పెన్నా తాండూరు సిమెంట్ కంపెనీలకు చెందిన ఫైళ్లు ఈడి స్వాధీనం చేసుకున్నవాటిలో ఉన్నట్లు సమాచారం. విశాఖపట్నం జిల్లాలో బాక్సైట్ లీజులకు సంబంధించిన ఫైలు కూడా అందులో ఉన్నట్లు తెలుస్తోంది. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫైలు కూడా వాటిలో ఉందని అంటున్నారు. రఘురాం సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్, ఈశ్వర్ సిమెంట్స్, భారతి సిమెంట్ కార్పోరేషన్‌లకు సంబంధించిన ఫైళ్లను ఈడి స్వాధీనం చేసుకుంది. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్, రఘురామ్ సిమెంట్స్, ఈశ్వర్ సిమెంట్స్, భారతి సిమెంట్ కార్పొరేషన్ సంస్థలు నేరుగా జగన్ పేరు మీద ఉన్నాయి. ఈ లీజులన్నీ 2007 - 08 మధ్య కాలంలోనే మంజూరు చేశారు.












Click it and Unblock the Notifications