స్వామిగౌడ్‌ను చంపే ప్రయత్నం జరిగింది: కెసిఆర్

స్వామిగౌడ్‌ను తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ కూడా పరామర్శించారు. తెలంగాణ ఉద్యమంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిరాశానిస్పృహల్లో ఉన్నారని ఆయన అన్నారు. స్వామిగౌడ్‌పై దాడికి నిరసనగా రేపు ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. తమ ఉద్యమం గాంధేయ మార్గంలో సాగుతోందని ఆయన చెప్పారు. తెలంగాణ నగారా నేతలు నాగం జనార్దన్ రెడ్డి, హరీశ్వర్ రెడ్డి, తెరాస శాసనసభ్యుడు ఈటెల రాజేందర్, తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్ తదితరులు స్వామిగౌడ్‌ను పరామర్శించారు. ఆర్‌టిఎ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్న నేపథ్యంలో సోమవారం ఉదయం స్వామి గౌడ్ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు.












Click it and Unblock the Notifications