కెసిఆర్ మోచేతి నీళ్లు: రాములమ్మపై లగడపాటి వ్యాఖ్య

కెసిఆర్ కుటుంబం హైదరాబాదులో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తోందని ఆయన అన్నారు. కెసిఆర్, కెటిఆర్, హరీష్ రావులకు గన్‌మెన్‌లను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. రౌడీషీటర్లతో అరాచకం సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. తాను జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ ముందు కూర్చుంటానని, ఎవరు వస్తారో రావాలని ఆయన అన్నారు. తెలంగాణలో విప్లవకారులను దొరలు, భూస్వాములను ఎలా చేశారో అందరికీ తెలుసునని ఆయన అన్నారు. తెలంగాణను దొరలు, భూస్వాములు, రజాకార్లు పీడించారని, ఇప్పుడు కెసిఆర్ పీడిస్తున్నారని ఆయన అన్నారు. ప్రజలను దొరలు తమ కాళ్ల కింద నొక్కి పెట్టారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలే ఈ పరిస్థితి ఏమిటని అసహ్యించుకుంటున్నారని ఆయన అన్నారు.
దౌర్జన్యం చేస్తున్న కెసిఆర్ కుటుంబాన్ని ఏం చేయాలో ప్రజలు, ప్రభుత్వం ఆలోచించాలని ఆయన అన్నారు. యాభై శాతం మంది ప్రజలు మాత్రమే తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకుంటున్నారని, ఆ శాతం కూడా తగ్గుతుందని ఆయన అన్నారు. అక్టోబర్ 7వ తేదీన సమైక్యాంధ్ర ప్రజాప్రతినిధులర సమావేశం జరుగుతుందని ఆయన అన్నారు. ఆ తర్వాత బహిరంగ సభ నిర్వహిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రపతి పాలన పెట్టే ప్రశ్నే లేదని ఆయన అన్నారు. కెసిఆర్ వద్దకు ఏ విధమైన ప్రతిపాదనా రాలేదని, కెసిఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆయన అన్నారు. కారులో ఎసి లేకున్నా తాను నాలుగు గంటల పాటు ఉన్నానని ాయన అన్నారు. హైదారాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా, ఉమ్మడి రాజధానిగా చేసే అవకాశాలు లేవని ఆయన అన్నారు. తాము చేతకానివాళ్లం కాదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు కెసిఆర్ దొరతనం నుంచి బయటపడాలని ఆయన పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications