వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీ నుండి బయటకు రావద్దు: టిటిడిపికి నాగం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
మహబూబ్ నగర్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు గతంలో చేసిన రాజీనామాలను ఆమోదింప చేసుకునే వరకు అసెంబ్లీ నుండి బయటకు రావద్దని మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు శాసనసభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి బుధవారం సూచించారు. సకల జనుల సమ్మెలో భాగంగా మహబూబ్ నగర్‌లో ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులకు మద్దతు తెలపడానికి నాగం వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టిటిడిపి నేతలు కొత్తగా రాజీనామాలు చేయకుండా పాత వాటినే ఆమోదింప చేసుకోవాలని సలహా ఇచ్చారు. అప్పటి వరకు ఆ శాసనసభ్యులు అసెంబ్లీ నుండి రావద్దన్నారు. ఢిల్లీ వెళ్లిన తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజా ప్రతినిధులు ఉత్తి చేతులతో తిరిగి రావద్దన్నారు. తెలంగాణపై కేంద్రంతో తాడోపేడో తేల్చుకొని రావాలని డిమాండ్ చేశారు.

కాగా టిఎన్జీవో నేత స్వామి గౌడ్‌పై మంగళవారం పోలీసులు దాడి చేశారని టిఎన్జీవో నేతలు మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. స్వామి గౌడ్‌పై పోలీసులు ఉద్దేశ్య పూర్వకంగానే దాడి చేశారని ఫిర్యాదు చేశారు. ఆ దాడికి పోలీసు అధికారి స్టీఫెన్ రవీంద్ర కారణమని ఆయనపై చర్యలు తీసుకోవాలని హెచ్చార్సీని కోరారు. అలాగే నేతల అరెస్టు పైనా ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుకు స్పందించిన హెచ్చార్సీ దాడి, అరెస్టులపై సోమవారం లోగా నివేదిక అందించాలని డిజిపిని ఆదేశించింది.

English summary
Nagarkurnool MLA Nagam Janardhan Reddy suggested Telangana Telugudesam Party MLAs on resignations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X