కెసిఆర్ ప్రకటనను వెనకేసుకొచ్చిన బొత్స సత్తిబాబు

తెలంగాణపై తమ పార్టీ అందరికీ మేలైన నిర్ణయం తీసుకుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. జాతీయ, రాష్ట్ర, ప్రాంతీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, ప్రజల మనోభావాలకు అనుగుణంగా తమ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. తాను, ముఖ్యమంత్రి అభిప్రాయాలు చెప్పగలం తప్ప నిర్ణయాలు తీసుకోలేమని ఆయన అన్నారు. తెలంగాణపై మరిన్ని సంప్రదింపులు అవసరమని ఆజాద్ అన్న మాటల్లో తప్పేమీ లేదని ఆయన అన్నారు. పార్టీపరంగా తాము ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాత యుపిఎ భాగస్వామ్య పక్షాలతో చర్చించాల్సి ఉంటుందని, ఆ తర్వాత ప్రతిపక్ష బిజెపితో చర్చించి మెజారిటీ ఉంటుందా, ఉండదా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
అధిష్టానానికి వాస్తవాలు చెప్పాలని తాను ఢిల్లీ వచ్చినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజల మనోభావాలను తమ పార్టీ అధిష్టానం అర్థం చేసుకుందని చెబుతూ సకల జనుల సమ్మెను విరమించాలని ఆయన కోరారు. త్వరలో సమస్య పరిష్కారమవుతుందని తాను భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. మంత్రి శంకరరావు సహచర మంత్రులపై ఆరోపణలు చేయడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఏమైనా ఉంటే ముఖ్యమంత్రితో మాట్లాడాలని, లేదంటే పార్టీ వేదిక మీద చెప్పాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications