పది రోజుల్లో తెలంగాణ అంశంపై అధికారిక ప్రకటన?

Telangana
న్యూఢిల్లీ: తెలంగాణపై మరో పది రోజుల్లో కాంగ్రెసు పార్టీ అధికారికంగా నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెసు పార్టీ నుండి వచ్చే పది రోజుల తర్వాత ఎప్పుడైనా ప్రకటన వెలువడ వచ్చుననే వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు తెలంగాణపై జాతీయ కాంగ్రెసు పార్టీ అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఆ పార్టీ తెలంగాణపై తమ స్టాండును అధికారికంగా ప్రకటించి ఆ తర్వాత యుపిఏ-2 ప్రభుత్వంలోని అన్ని పార్టీలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. యుపిఏ-2లోని అన్ని పార్టీలను సైతం తెలంగాణకు అనుకూలంగా ఒప్పించే ప్రయత్నాలు కాంగ్రెసు పార్టీ చేయనున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉండటంతో తెలంగాణ అంశాన్ని తేల్చి పారేయాలన్న ఉద్దేశ్యంతోనే పార్టీ అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తోంది.

సకల జనుల సమ్మె రోజు రోజుకు ఉధృతమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర పరిస్థితులు మరింత దిగజారకుండా ఉండాలంట రాష్ట్ర విభజనే శ్రేయస్కరమనే నిర్ణయానికి కాంగ్రెసు పార్టీ వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే అందులోని సాధ్యాసాధ్యాలు పార్టీలో చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంతో పాటు, రాయల తెలంగాణ తదితర అంశాలని కేంద్రం పరిశీలిస్తోందన్న వాదనలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రత్యేక తెలంగాణకు సీమాంధ్ర నేతలు ఎవరూ అంగీకరించడం లేదు. మరోవైపు తెలంగాణ ప్రజలు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసి ఉండలేమంటున్నారు. అయితే ఇటీవల వచ్చిన రాయల తెలంగాణ అంశం ఇరు ప్రాంతాల్లో చర్చానీయాంశం అయినప్పటికీ అనంతపురం, కర్నూలు జిల్లా నేతలు పలువురు దానికి ఓకే చేశారు.

అయితే కడప, చిత్తూరు, ఆంధ్రా జిల్లాల నేతలు అందుకు ససేమీరా అన్నప్పటికీ వారిని ఒప్పించేందుకు అధిష్టానం ప్రయత్నాలు చేయవచ్చునన్న వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో సకల జనుల సమ్మె, రాయల తెలంగాణ తదితర అంశాలతో రాష్ట్ర రాజకీయాలు బాగా వేడెక్కిన ఈ సమయంలోనే అటు సీమాంధ్ర నేతలు అక్టోబర్ రెండో వారంలో ఢిల్లీ వెళ్లనున్నారు. వారు సమైక్యాంధ్రనే ఉంచాలనే డిమాండుతో ఢిల్లీ వెళుతున్నారు. మరోవైపు టిఆర్ఎస్ చీఫ్ కెసిఆర్ ఐకాస నేతలతో కలిసి త్వరలో ఢిల్లీ వెళ్లనున్నారు. సీమాంధ్ర నేతలను, ఇటు తెలంగాణ ప్రాంత నేతలను అధిష్టాం వారి ఢిల్లీ యాత్రలోనే రాష్ట్ర విభజనకు ఒప్పించే దిశలో ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+