మంత్రి శంకరరావుకు ఉద్వాసన, అధిష్టానం గరం?

అయితే, ఆ వార్తలను శంకరరావు కొట్టిపారేస్తున్నారు. ఆ వార్తను తాను పట్టించుకోనని ఆయన అన్నారు. అది గోబెల్స్ ప్రచారం మాత్రమేనని ఆయన అన్నారు. మీడియా, రాజకీయ బెదిరింపులు మాత్రమేనని ఆయన అన్నారు. అవినీతికి పాల్పడుతున్న 300 మంది ప్రజాప్రతినిధులపై తాను పోరాటం చేస్తున్నానని, ఈ స్థితిలో అలాంటివన్నీ మామాలేనని ఆయన అన్నారు.
కాగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై కూడా పి. శంకరరావు ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గ సమావేశాలకు కూడా వెళ్లడం లేదు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మోపిదేవి వెంకటరమణలపై ఆయన చేసిన ఆరోపణలు తీవ్రమైన పరిణామాలను తెచ్చిపెట్టాయి. తనకు భద్రత కల్పించే విషయంలో కూడా తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి శంకరరావు తీరు పట్ల పార్టీ అధిష్టానం అసంతృప్తితో ఉందనడానికి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. శంకరరావు ఆలాంటి ఆరోపణలు చేయడం దురదృష్టకరమని ఆయన గురువారం న్యూఢిల్లీలో అన్నారు.












Click it and Unblock the Notifications