కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్ పుకార్లేనా?

పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ గురువారం సాయంత్రం గులాం నబీ ఆజాద్‌తో సమావేశమై చర్చించారు. తెలంగాణపై నిర్ణయం తీసుకునే విషయంలో బొత్స సత్యనారాయణ వెసులుబాటు కలిగిస్తున్నట్లు సమాచారం. శుక్రవారం సాయంత్రం జరిగే పార్టీ కోర్ కమిటీ సమావేశంలో ఆ నివేదికపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత తెలంగాణపై అక్టోబర్ 3 లేదా 4వ తేదీన మరోసారి కోర్ కమిటీ సమావేశమయ్యే అవకాశాలున్నాయి. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా ఆహ్వానిస్తారు. ఈ సమావేశంలో తెలంగాణపై తుది నిర్ణయం తీసుకోవచ్చునని అంటున్నారు.
ఇదిలా వుంటే, మహాత్మా గాందీ జయంతి కార్యక్రమంలో పాల్గొనడానికి పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఆజాద్‌ను విజయవాడకు ఆహ్వానించారు. అయితే, ఈ సమావేశానికి ఆజాద్ వస్తారా, వస్తే సమైక్యవాదుల నుంచి ఎటువంటి ప్రతిఘటన ఎదురవుతుందనేది చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications