కెసిఆర్‌తో రహస్య భేటీ, 7న జానా రెడ్డి రాజీనామా?

కెసిఆర్‌తో జానా రెడ్డితో పాటు రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు కూడా సమావేశమయ్యారు. తెలంగాణ జెఎసి నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మంత్రి పదవికి రాజీనామా చేస్తూ నేరుగా గవర్నర్‌కు లేఖ ఇవ్వాలని, అప్పుడే ప్రజల్లో విశ్వాసం కలుగుతుందని కెసిఆర్‌తో పాటు జెఎసి నేతలు జానా రెడ్డికి సూచించినట్లు సమాచారం. ప్రభుత్వాన్ని కాపాడుతూ పదవుల్లో కొనసాగితే తెలంగాణ సాధించడం సాధ్యం కాదని వారు చెప్పినట్లు తెలుస్తోంది. మరో పదిహేను రోజులు వేచి చూద్దామన్న జానా రెడ్డి సూచనను కెసిఆర్ వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. కెసిఆర్‌తో భేటీపై జానా రెడ్డిని సంప్రదించగా, మా బాధలు మేం చెప్పుకున్నాం, ఆయన బాధలు ఆయన చెప్పుకున్నారని అన్నట్లు ఓ ప్రముఖ దినపత్రిక రాసింది.












Click it and Unblock the Notifications