బొత్స సమక్షంలో జెసి వర్సెస్ రఘువీరా రెడ్డి వర్గం

గతంలోనూ పలుసార్లు ఇరువర్గాల మధ్య వర్గ పోరు బయట పడిన విషయం తెలిసింది. ఇటీవలె జిల్లా పార్టీ సమావేశం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. జెసి దివాకర్ రెడ్డి సోదరుడు జెసి ప్రభాకర్ రెడ్డి సమావేశానికి వచ్చిన సమయంలో జెసి వర్గీయులు, రఘువీరా వచ్చినప్పుడు ఆయన వర్గీయులు వారికి అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో జిల్లా సమావేశం కాస్త రసాభాసగా మారింది. గత కొన్నాళ్లుగా ఇరు వర్గాల మధ్య పోరు నడుస్తోంది. తరుచూ జెసి దివాకర్ రెడ్డి సైతం జిల్లాలోని కాంగ్రెసు నేతలంతా ఎప్పటికైనా జగన్ వెంట వెళతారని తాము మాత్రమే చివరి వరకు కాంగ్రెసులో ఉంటామని అంటుంటారు.












Click it and Unblock the Notifications