కెసిఆర్ వైపు చూస్తున్న నాగం వర్గం ఎమ్మెల్యే

పార్టీ జెండా లేకుండా ఉద్యమిస్తున్నందున రావాల్సిన క్రెడిట్ దక్కడం లేదనే భావన వారిలో కనిపిస్తోంది. తెలంగాణ నగారా సమితి పేరుతో నాగం బృందం ఉద్యమిస్తున్నప్పటికీ అది అంతగా ప్రజలలోకి చొచ్చు పోవడం లేదు. కేవలం నలుగురు ఎమ్మెల్యేలు కలిసి తెలంగాణ నగారా సమితిని తెలంగాణలోని పది జిల్లాలలోకి తీసుకు పోవడం ఆసాధ్యం. దీంతో మరో ప్రత్యామ్నాయం వైపు దృష్టి సారించడమే మేలని వారు భావిస్తున్నారు. అందులో భాగంగానే జోగు రామన్న తెరాస వైపు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ పార్టీతో ఆయన చర్చలు కూడా జరిపినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన ఎప్పుడైనా తెరాసలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలంగాణ సెంటిమెంటు బలంగా ఉన్న దృష్ట్యా తాను బయటకు వస్తా తన దారినే మరికొంతమంది టిడిపి ఎమ్మెల్యేలు వస్తారని నాగం భావించి బయటకు వచ్చారు. అయితే ఆయన వెంట ఇప్పటి వరకు కేవలం ముగ్గురు మాత్రమే వచ్చారు. వారూ మొదటి నుండి ఉన్న వారే. కొత్తగా వచ్చి చేరిన వారు లేరు. ఇటీవల టిడిపికి రాజీనామా చేసిన గంపా సైతం నాగం వైపు కాకుండా తెరాసకే ఓటు వేశారు. టిడిపి తెలంగాణ ఎమ్మెల్యేలైనా, మరెవరైనా నాగం వైపు రావాలనుకున్నప్పటికీ ఆయనకు సరైన వేదిక లేకపోవడంతో తెరాస వైపు వెళుతున్నారు. దీంతో నాగం సైతం పునరాలోచనలో పడినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ కోసం బయటకు వచ్చే ఎమ్మెల్యేలను తన వైపు లాక్కోవడానికి, ఉన్న వారిని కాపాడుకోవడానికి ఆయన భారతీయ జనతా పార్టీలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications