వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ కాంగ్రెసు నేతలకు ప్రధాని వద్ద భంగపాటు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Madhu Yashki-Geetha Reddy
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజాప్రతినిధులకు న్యూఢిల్లీలో మరోసారి భంగపాటు తప్పలేదు. సోమవారం ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిసిన ప్రజా ప్రతినిధులకు ఆయన వద్ద నుండి తెలంగాణపై ఎలాంటి హామీ రాలేదు. మూడు ప్రాంతాల ప్రజలకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకునేలా చర్యలు తీసుకుంటామని అలాగే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి చెప్పి కోర్ కమిటీలో చర్చిస్తానని మాత్రమే మాట ఇచ్చినట్లు ప్రధానితో భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. తెలంగాణ కోసం జరుగుతున్న ఆత్మహత్యలను వివరించామని, అలాగే తెలంగాణ ఆవశ్యకతను చెప్పామన్నారు. పార్టీ ప్రత్యేక రాష్ట్రం ఇస్తుందన్న నమ్మకం తమకు ఉందన్నారు. త్వరలో తెలంగాణ అంశాన్ని తేల్చే అవకాశం ఉందని వారు అభిప్రాయపడ్డారు.

సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని కోరినట్లు చెప్పారు. గ్రూప్ - 1 పరీక్షలను మళ్లీ నిర్వహించాలని కోరామని తమ విజ్ఞప్తికి ప్రధాని సానుకూలంగా స్పందించారని చెప్పారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారన్నారు. తెలంగాణపై పిఎంవో ఓ ప్రకటన చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. రైతుల ఇబ్బందులను సైతం ప్రధాని వద్ద ప్రస్తావించినట్లు చెప్పారు. ప్రధానిని కలిసిన తెలంగాణ కాంగ్రెసు బృందంలో 11మంది ఉన్నారు. రాజ్య సభ సభ్యుడు వి హనుమంతరావు, మంత్రులు గీతారెడ్డి, బస్వరాజు సారయ్య తదితరులు ఉన్నారు.

English summary
Prime Minister Manmohan Singh did not make any promise to Telangana Congress leaders on separate state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X