ప్రధాని హామీ ఇవ్వలేదు, సమ్మె ఆగదు: కెసిఆర్

K Chandrasekhar Rao
న్యూఢిల్లీ: తెలంగాణపై ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తమకు ఏ విధమైన హామీ ఇవ్వలేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చెప్పారు. తెలంగాణ జెఎసి నేతలతో కలిసి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను, లోకసభ ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్‌ను కలిసిన అనంతరం ఆయన సోమవారం రాత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సమ్మెను విరమించాలని ప్రధాని కోరారని, అయితే సమ్మెను ఆపడం తమ చేతుల్లో లేదని చెప్పామని ఆయన అన్నారు. సమ్మెను ఆపబోమని చెప్పినట్లు ఆయన తెలిపారు. తాము రేపు హైదరాబాదు వెళ్తున్నామని, సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు.

తెలంగాణలో పరిస్థితి తనకు తెలుసునని, త్వరలో పరిష్కరిస్తామని, పరిష్కారానికి సమయం కావాలని అన్నారే తప్ప తమకు ఏ విధమైన హామీ ప్రధాని నుంచి లభించలేదని ఆయన అన్నారు. ఈ నెల 9, 10 తేదీల్లో తలపెట్టిన రైల్ రోకో కార్యక్రమాన్ని ఉధృతంగా చేస్తామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తాము ప్రధానికి ఫిర్యాదు చేశామని ఆయన చెప్పారు. ఐదు డిమాండ్లతో కూడిన విజ్ఞప్తి పత్రాన్ని ప్రధానికి సమర్పించినట్లు ఆయన తెలిపారు. విద్యుత్తు ఇవ్వగలిగి కూడా ముఖ్యమంత్రి ఇవ్వడం లేదని ఆయన అన్నారు. ల్యాంకో వంటి సంస్థలు విద్యుత్తును అమ్ముకుంటున్నాయని, దాన్ని ఆపేసి రాష్ట్రానికి విద్యుత్తును తీసుకోవచ్చునని ఆయన అన్నారు. జల విద్యుదుత్పత్తి కూడా చేపట్టవచ్చునని ఆయన అన్నారు.

తెలంగాణకు తాము పూర్తి మద్దతు ఇస్తామని సుష్మా స్వరాజ్ హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. తమ డిమాండ్లతో రేపు ప్రధానికి లేఖ రాస్తానని కూడా ఆమె చెప్పారని ఆయన అన్నారు. అవకాశం లభించింది కాబట్టి సిపిఐ ప్రధాన కార్యదర్సి ఎబి బర్దన్‌ను కూడా కలిశామని ఆయన అన్నారు. ఉద్యమాన్ని గాంధేయ పద్ధతిలో నడిపిస్తామని చెప్పడానికి తాము బాపూ ఘాట్ వద్ద ప్రదర్శన చేయాలనే ప్రధాన ఉద్దేశంతో ఢిల్లీ వచ్చామని, అవకాశం లభించింది కాబట్టి నేతలను కలిశామని ఆయన అన్నారు. అవసరమైతే, అవకాశం వస్తే కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలవడానికి తమకు అభ్యంతరం లేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+