కెసిఆర్‌కు దొరికిన ప్రధాని అపాయింట్‌మెంట్

ఇటీవల సకల జనుల సమ్మెలో పాల్గొన్న స్వామి గౌడ్‌పై పోలీసులు హత్యా యత్నం చేశారనే విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకు వెళ్లాలని కెసిఆర్ భావిస్తున్నారు. సమ్మె ప్రశాంతంగా కొనసాగిస్తున్నప్పటికీ ప్రభుత్వమే రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తోందని, అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించేందుకు చొరవ చూపాలని కోరే అవకాశం ఉంది. కాగా అంతకుముందే వారు మూడు గంటలకు కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డితో భేటీ కానున్నారు. పదకొండు గంటలకు ఎన్‌హెచ్చార్సీని కలిసి ప్రభుత్వం చర్యలపై ఫిర్యాదు చేస్తారు. కాగా తెలంగాణ మంత్రులకు కూడా ప్రధాని అపాయింట్‌మెంట్ ఖరారైంది. మధ్యాహ్నం 12.30 గంటలకు మంత్రులు ప్రధానిని కలవనున్నారు.












Click it and Unblock the Notifications