తెలంగాణ నేతల దూకుడుపై ఆజాద్‌కు సిఎం ఫిర్యాదు

Kiran Kumar Reddy-Ghulam Nabi Azad
విజయవాడ: పార్టీ తెలంగాణ నేతలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాదు నుంచి విజయవాడ వెళ్లే మార్గంలో విమానంలో ఆదివారంనాడు ఆయన రాష్ట్ర పరిస్థితులను ఆజాద్‌కు వివరించినట్లు సమాచారం. తమ చేతలు, వ్యాఖ్యల ద్వారా పార్టీకి నష్టం కలిగిస్తున్న తెలంగాణ నేతలను కట్టడి చేయాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది. కొంత మంది తెలంగాణ నాయకులు పార్టీకి నష్టం కలిగిస్తున్నారని ఆయన ఫిర్యాదు చేసినట్లు వినికిడి.

ఉద్యోగుల సమ్మె వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ప్రభావాన్ని కూడా ముఖ్యమంత్రి ఆజాద్‌కు వివరించినట్లు తెలుస్తోంది. ఆదివారంనాడు విమానంలో ఆజాద్‌తో పాటు ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి సహాయకులు ప్రయాణించారు. కొద్ది మంది చర్యల వల్ల తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారని, విద్యుత్తు కొనుగోలుకే రోజుకు 15 కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తోందని ముఖ్యమంత్రి ఆజాద్‌తో చెప్పినట్లు సమాచారం. విద్యుదుత్పత్తి తగ్గిపోవడం వల్ల బెంగళూర్, పూణేల్లోని ఐటి కంపెనీలు కూడా దెబ్బ తింటున్నాయని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.

పరిస్థితి గురించి తమకు పూర్తిగా తెలుసునని, సమస్య పరిష్కారానికి తాము తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని, సమ్మె చేస్తున్న ఉద్యోగులతో చర్చించి వారు విధులకు హాజరయ్యేలా చూడాలని ఆజాద్ ముఖ్యమంత్రి చెప్పినట్లు సమాచారం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేయడంపై ఆయన అడిగి తెలుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఎవరైనా రాజీనామా చేసే అవకాశాలున్నాయా అని కూడా ఆయన ఆరా తీసినట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+