ఎవరితోనైనా కలిసి పనిచేస్తాం: తెలంగాణ కాంగ్రెసు

తెలంగాణ కోసం తాము ఏ ఆందోళనాకార్యక్రమం చేపట్టినా పార్టీ ధిక్కరణ కాదని మంత్రి కె. జానా రెడ్డి అన్నారు. క్రమశిక్షణ కలిగిన కాంగ్రెసు కార్యకర్తలుగా తెలంగాణ సాధిస్తామని ఆయన అన్నారు. రాజీనామాలు చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నం కావని కూడా ఆయన అన్నారు. పార్టీని వీడేది లేదని, కాంగ్రెసులోనే ఉంటామని ఆయన చెప్పారు. తాము చేపట్టే కార్యక్రమాలు పార్టీ మనుగడను కాపాడేదిగా ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణ సమస్యను సాధ్యమైనంత త్వరగా తేల్చాలని తెలంగాణ కాంగ్రెసు నేతలు ప్రధానిని కోరారు. తెలంగాణపై స్పష్టత కోసమే తాము ఢిల్లీకి వచ్చామని ఆయన చెప్పారు. తమ ఉనికే ప్రశ్నార్థకంగా మారినప్పుడు పార్టీని ఎలా కాపాడగలమని వారంటున్నారు. కాగా, తెలంగాణ ఉద్యమం శాంతియుతంగా ఉంది, ఉండాలని జానా రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications