గాలి జనార్దన్ రెడ్డిపై మరో రెండు కేసులు నమోదు

కర్నాటక మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ శాసనసభ్యుడు గాలి జనార్ధన్ రెడ్డి సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాలలో సిబిఐ అధికారులు సోమవారం సోదాలు చేశారు. ఇటీవలె అనంతపురం జిల్లాలో గాలికి సన్నిహితుడైన స్వస్తిక్ నాగరాజు, మహేష్ తదితరుల ఇళ్లు, కార్యాలయాలలో దాడులు చేసిన విషయం తెలిసిందే. వారిని ఇటీవలే సిబిఐ విచారించింది కూడా. తాజాగా కర్నాటక శాసనసభ్యుడు నాగేంద్ర ఇల్లు, ఆయనకు చెందిన దక్కన్ మైనింగ్ కార్పొరేషన్ కార్యాలయంతో పాటు, ఏషియన్ మైనింగ్ కార్పొరేషన్ తదితర ఐదు ప్రాంతాలలో సిబిఐ అధికారులు సోదాలు చేశారు.
బళ్లారితో పాటు అనంతపురంలో దిగిన ఐదు సిబిఐ బృందాలు ఉదయం నుండే సోదాలు ప్రారంభించి పలు కీలక పత్రాలు, సీడీలు స్వాధీనం చేసుకున్నారు.ఆయా కంపెనీల లీజు కాంట్రాక్టులు, పరిమిట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇందులో పలు కంపెనీలు గాలికి బినామీ కంపెనీలుగా వారు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications