చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డిఎంకె మాజీ మంత్రి పన్నీర్‌ సెల్వం ఇళ్లలో సోదాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

MRK Panneerselvam
చెన్నై: డిఎంకె మాజీ మంత్రి పన్నీర్ సెల్వం ఇళ్లలో, ఆయన బంధువుల ఇళ్లలో విజిలెన్స్, అవినీతి నిరోధక డైరెక్టరేట్ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. కడలూరు, చిదంబరం, చెన్నైల్లోని ఇళ్లలో ఈ సోదాలు జరిగాయి కుంద్రత్తూరులోని మాజీ మంత్రి టిఎం అంబ్రోసన్ ఇంటిలో సోదాలు నిర్వహించిన కొద్ది రోజులకే డైరెక్టరేట్ అధికారులు పన్నీర్ సెల్వం ఇళ్లలో, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు చేశారు.

కడలూరు జిల్లాలో డిఎంకెకు బలమైన నాయకుడు పన్నీర్ సెల్వం. డిఎంకె ప్రభుత్వంలో మంత్రిగా ఆయన వెనకబడిన తరగతులు, ఆరోగ్య శాఖలను నిర్వహించారు. ఏప్రిల్ 13న జరిగిన శానససభ ఎన్నికల్లో ఆయన కురిచిపాడి నియోజకవర్గం నుంచి అన్నాడియంకె అభ్యర్థి సోరత్తూరు రాజేంద్రన్ చేతిలో ఓడిపోయారు. భూకబ్జా కేసులో విజిలెన్స్ డైరెక్టరేట్ సెప్టెంబర్‌లో విద్యాశాఖ మాజీ మంత్రి కె. పొన్ముడిని అరెస్టుచేసింది. భూకబ్జా కేసుల్లోనే మాజీ మంత్రులు వీరపాండి ఎస్ ఆర్ముగం, కెఎన్ నెహ్రూ, ఎన్‌కెకె రాజా అరెస్టయ్యారు.

English summary
Directorate of Vigilance and Anti Corruption today searched the residences of former DMK minister M R K Panneerselvam and his relatives in Cuddalore, Chidambaram and Chennai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X