పిల్లలను, స్త్రీలను బెదిరిస్తున్నారు: తెలంగాణవాదులపై జోగి

బస్సులు ధ్వంసం చేసిన ఆందోళనకారులపై వెంటనే క్రిమినల్ కేసు పెట్టించి వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్ వైఖరి తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకంగా ఉందన్నారు. ఆందోళనకారులు పిల్లల్ని, ఆడవారిని బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు సైతం బస్సులు అడ్డుకోవడాన్ని తప్పు పట్టారు. విజయవాడ - నల్లగొండ సరిహద్దుల్లో బస్సులను అడ్డుకోవడం సరికాద్నారు. రాష్ట్రంలోని పరిస్థితులను అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కేంద్రం వెంటనే జోక్యం చేసుకొని పరిస్థితులు చక్కదిద్దాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులు సమ్మె నోటీసు నెల రోజులు ముందు ఇచ్చినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెసు అధికారంలో ఉంది కాబట్టే కేంద్రం పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తోందని విమర్శించారు.












Click it and Unblock the Notifications